డౌన్ లోడ్ అయిన 50 వేల రొమాన్స్ కాలర్ ట్యూన్స్

Romance
యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రొమాన్స్’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి మంచి క్రేజ్ వస్తోంది అలాగే ఈ చిత్ర ఆడియోకి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్ర నిర్మాత ఎస్.కె.ఎన్ ఇప్పటివరకూ 50 వేల కాలర్ ట్యూన్స్ డౌన్ లోడ్ అయ్యాయని మీడియాకి తెలియజేశారు. యువతరాన్ని ఆకట్టుకునే సినిమాలు తీసిన మారుతి ఈ సినిమాని సమర్పిస్తున్నారు. డార్లింగ్ స్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రిన్స్ హీరోగా నటించగా డింపుల్ చొప్దా, మానస హీరోయిన్స్ గా నటించారు. సాయి కార్తీక్ సంగీతాన్ని అందించాడు.

Exit mobile version