సమీక్ష : 120 బహదూర్ – స్లో గా సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామా

సమీక్ష : 120 బహదూర్ – స్లో గా సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామా

Published on Nov 21, 2025 11:07 PM IST

విడుదల తేదీ : నవంబర్ 21, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : ఫర్హాన్ అక్తర్, రాశి ఖన్నా, స్పర్శ్ వాలియా, ధన్వీర్ సింగ్, సాహిబ్ వర్మ, బ్రిజేష్ కరణ్‌వాల్, తదితరులు
దర్శకుడు : రజ్నీష్ ఘాయి
నిర్మాతలు : ఫర్హన్ అక్తర్, రితేష్ సిధ్వాని, అమిత్ చంద్ర
సంగీతం : అమిత్ త్రివేది, సలీమ్ – సులేమన్, అంజద్ నదీమ్ ఆమీర్
సినిమాటోగ్రాఫర్ : టెట్సువో నగాట
ఎడిటర్ : రామేశ్వర్ ఎస్ భగత్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

బాలీవుడ్‌లో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం ‘120 బహదూర్’ నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

1962లో జరిగిన ఇండియా-చైనా యుద్ధం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు మేకర్స్. ఇక ఈ కథలో మేజర్ షైతాన్ సింగ్ భాటి(ఫర్హాన్ అక్తర్) తన 120 మంది సైనికులతో ఇండియా-చైనా బోర్డర్‌ను చైనా సైన్యం నుండి ఎలా కాపాడాడు అనేది మనకు ఈ సినిమా కథలో చూపించారు.

ప్లస్ పాయింట్స్ :

పీరియాడిక్ చిత్రాలకు కావాల్సిన యాక్షన్, ఎమోషన్ మనకు ఈ సినిమాలు కనిపిస్తుంది. ఇక ఈ సినిమా వార్ నేపథ్యంలో సాగడంతో అందుకు కావాల్సిన అన్ని అంశాలను చక్కగా ప్రజెంట్ చేశారు.

ముఖ్యంగా సెకండాఫ్‌లో ఈ సినిమాలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్‌గా నిలిచాయి. వాటిని ప్రజెంట్ చేసిన తీరు, ఆ సమయంలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్‌లు బాగున్నాయి. ఇక క్లైమాక్స్ దిశలో ఈ సినిమా ఎమోషనల్ కంటెంట్‌గా మారిన వైనం బాగుంది. సినిమాలోని ప్లాట్ అందరికీ కనెక్ట్ అయ్యేలా తీర్చడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ డ్రా బ్యాక్ ఈ చిత్ర ఫస్ట్ హాఫ్ అని చెప్పాలి. కథను ఎస్టాబ్లిష్ చేసేందుకు మేకర్స్ చాలా టైమ్ తీసుకోవడం పెద్ద మైనస్. ఇక ఫస్టాఫ్‌లో పెద్ద ట్రీట్ అందించే సీన్స్ లేకపోవడం మరో మైనస్.

ఈ సినిమాలో చాలా మంది యాక్టర్స్‌ను ప్రేక్షకులు గుర్తుపట్టలేకపోవడం కూడా సినిమాకు మైనస్‌గా మారింది. కొంతమంది మాత్రమే సుపరిచితులు కావడంతో మిగతా వారిపై ఫోకస్ పడలేదు.

ఇక సెకండాఫ్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లకు పూర్తి న్యాయం చేసినట్లు అనిపించినా.. ఎక్కడో కామన్ ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేయలేకపోయారు అనే భావన సినిమా చూస్తే కలుగుతుంది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు రజ్నీష్ ఘాయ్ ఈ సినిమాకు ఎంచుకున్న కథ పవర్‌ఫుల్‌దే అని చెప్పాలి. కానీ, ఇలాంటి కథలను ఇంకా పవర్‌ఫుల్‌గా ట్రీట్ చేసి ఉండాలి. సుమిత్ అరోరా డైలాగ్స్ చాలా వరకు వర్కవుట్ అయ్యాయి. సంగీతం కూడా పర్వాలేదనిపించింది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

తీర్పు :

ఓవరాల్‌గా ‘120 బహదూర్’ చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా కొంతవరకు పర్వాలేదనిపించింది. వాస్తవంగా జరిగిన సంఘటనలు, అందులోని పాత్రలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఫర్హాన్ అక్తర్ తనదైన పర్ఫార్మె్న్స్‌తో ఇంప్రెస్ చేస్తాడు. అయితే కథలో బోరింగ్ ఎపిసోడ్స్ చాలా ఉండటం.. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో ఎలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం మెప్పించదు. వార్ యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా కొంతవరకు మాత్రమే కనెక్ట్ అవుతుంది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

తాజా వార్తలు