సాయిరాం శంకర్, ఎస్తేర్ నటీనటిలుగా శ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై చిత్రం మూవీస్ సమర్పణలో సునీత నిర్మిస్తూ, తేజ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘1000 అబద్ధాలు’.ఈ సినిమా సెన్సార్ మరియు నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ సినిమా జూలై రెండో వారంలో విడుదల కానుంది. చాలా కాలం తరువాత రమణ గోగుల తన బాణీల ద్వారా మన ముందుకు రానున్నాడు. సంగీతమే కాక ఇతను ఇందులో ఒక పాటకుడా రాయడం విశేషం. హీరో సాయిరాం శంకర్ ఇదివరకే ‘బద్రి’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడంతో రమణ గోగులతో మంచి పరిచయమే వుంది. ఈ సినిమాకు రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.