10న విడుదలకి సిద్దమవుతున్న ‘1’

1_nenokkadine
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్టైలిష్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘1-నేనొక్కడినే’. జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. అనుకున్న టైంకి సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించాలని ఈ చిత్ర ప్రొడక్షన్ టీం రాత్రి పగలు తేడా లేకుండా 24 గంటలు పనిచేస్తున్నారు. అలాగే అనుకున్న టైంకి సినిమా రెడీ అవుతుందని వారు ఎంతో నమ్మకంగా ఉన్నారు.

మహేష్ బాబు – కృతి సనన్ జంటగా నటించిన ఈ సినిమాకి సుకుమార్ డైరెక్టర్. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాకి రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసాడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ రైట్స్ ని ఈరోస్ వారు సొంతం చేసుకున్నారు. ‘1-నేనొక్కడినే’ సినిమాలో హై విజువల్ ఎఫెక్ట్స్ తో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయి.

Exit mobile version