కొద్ది రోజుల క్రితం సుకుమార్ డైరెక్షన్లో మహేష్ బాబు సరసన మిల్క్ వైట్ బ్యూటీ తమన్నా హీరొయిన్ గా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మహేష్ బాబు అభిమానులకు మరియు సినిమా అభిమానులకు ఈ వార్త ఆనందాన్ని కలిగించింది కూడా. ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చట్లేదని మాకు వార్త అందింది. ఈ చిత్ర నిర్మాతలు మహేష్ సరసన నటించడానికి కొత్త హీరొయిన్ ని వెతుకుతున్నారు. ఒక సీనియర్ హీరొయిన్ ని కూడా సంప్రదించినట్లు సమాచారం. త్వరలోనే ఆ హీరొయిన్ ఎవరన్నది ప్రకటిస్తాం అని నిర్మాతలు చెబుతున్నారు. ఈ చిత్రం ఈ నెల 12 న అధికారికంగా పూజ కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని ఇటీవలే మహేష్ బాబుతో ‘దూకుడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ నిర్మించిన 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. సుకుమార్ సాఫ్ట్ రొమాంటిక్ స్క్రిప్ట్ తో రాబోతున్నారని సమాచారం.