అల్లు అర్జున్ పాత్రలో ‘జీన్స్’ ప్రశాంత్

అల్లు అర్జున్ పాత్రలో ‘జీన్స్’ ప్రశాంత్

Published on Feb 26, 2014 2:18 PM IST

prasanth-and-allu-arjun
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా ‘జులాయి’. గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్ ఓ కీలక పాత్ర పోషించాడు. అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించింది. అలాగే కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమాని తమిళంలో రీమేక్ చేస్తున్నారు.

తమిళ రీమేక్ లో అల్లు అర్జున్ పాత్రలో ‘జీన్స్’ సినిమాతో మనకు పరిచయం ఉన్న ప్రశాంత్ నటిస్తున్నాడు. కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ పాత్రని తంబి రామయ్య పోషిస్తున్నారు. గత కొంత కాలంగా హిట్స్ లేక డీలా పడిపోయిన ప్రశాంత్ ఈ సినిమాతో తన పూర్వ వైభవాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది.

తాజా వార్తలు