​​గౌతంను చూస్తుంటే గర్వంగా ఉంది – బ్రహ్మానందం

​​గౌతంను చూస్తుంటే గర్వంగా ఉంది – బ్రహ్మానందం

Published on Feb 26, 2014 8:30 AM IST

Basanthi-Press-Meet-(20)
కామెడీ నటుడు బ్రహ్మనందం కామెడీ నటులలో ఒక గొప్ప స్టార్ . ఆయన వందల సినిమాల్లో నటించాడు. ఆయనకు హీరోలకు ఉన్నంత పాపులారిటీ ఉంది. సినిమా ఇండస్ట్రీలో వారసత్వంగా సర్వసాదారణం. అలాగే బ్రహ్మనందం కూడా తన కొడుకు గౌతంను కొద్ది రోజుల క్రితం హీరోగా పరిచయం చేశాడు. అప్పుడు ఆయన పెద్దగా రాణించలేదు. ప్రస్తుతం గౌతం తన కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్ మొదలుపెట్టాడు. గౌతం ప్రస్తుతం తన సినిమా కోసం బాడీ లాంగ్వేజ్ ని, బాడీని పూర్తిగా మార్చుకొని చూడటానికి చాలా అందంగా తయారైయ్యాడు. ఈ సినిమాని డైరెక్టర్ చైతన్య దంతులూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని ఈ సినిమాని చాలా చక్కగా తెరకెక్కించారు.

దీనిపై బ్రహ్మనందం మాట్లాడుతూ గౌతం కెరీర్ ని ఈ సినిమా చేంజ్ చేస్తుందని అన్నాడు. అలాగే ఈ మధ్య జరిగిన ఇంటర్వ్యూ లో మీడియా మాట్లాడుతూ ‘ గౌతమే నాకున్న ఆస్థి. ఈ సినిమా తను నటించడం నాకు చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా తప్పకుండ మంచి విజయాన్ని సాదిస్తుంది. చైతన్య దంతులూరి చాలా టాలెంటెడ్ డైరెక్టర్. ఈ సినిమాలో ఆయన కమర్షియల్ ఎలిమెంట్స్ ని చాలా చక్కగా చూపించారు’. అని అన్నాడు.

‘ బసంతి’ సినిమా ఈ నెల 28న రాష్ట్రమంతటా విడుదలవుతోంది. స్టూడెంట్ పాలిటిక్స్ మరియు టెర్రరిజం వంటి సమస్యలను బేస్ గా చేసుకొని ఈ సినిమాని తెరకెక్కించారు.

తాజా వార్తలు