తమన్నా ప్రస్తుతం చాలా బిజీగా మారింది. ఆమె ఆగడు, హామ్ షకల్స్ సినిమాల మధ్య ఊగీసలాడుతుంది. ఇప్పటివరకూ ఆగడు షూటింగ్ లో బిజీగా వున్న ఈ భామ ఇప్పుడు ఈ చిత్ర బృందమంతా మహేష్ తో టైటిల్ ట్రాక్ కోసం బళ్ళారి వెళ్తే ఈ భామ వేరే సినిమాల కోసం చెక్కేసింది
హిమ్మత్ వాలా సినిమాను తీసి తమన్నా ను హిందీలో పరిచయం చేసిన షాజీద్ ఖాన్ తీస్తున్న హామ్ షకల్స్ షూటింగ్ కోసం మారీషస్ వెళ్లింది. హిమ్మత్ వాలా టైమ్ లో వీరిద్ధరూ మంచి స్నేహితులు అయ్యారు. తమన్నాను ఏకంగా మరో శ్రీదేవి అని కితాబిచ్చారు. ఈ సినిమాలో సైఫ్ ఆలీఖాన్, బిపాసా బసు, ఇషా గుప్తా, రితేష్ దేశ్ముఖ్ వంటి తారలు నటిస్తున్నారు
ఈ రెండు సినిమాలలోనే కాక తమన్నా రాజమౌళి బాహుబలి సినిమాలో ప్రభాస్ సరసన నటించనుంది. ఈ సినిమాలో వేసవినుండి పాల్గొనుంది