అల్లరి నరేష్ సినిమాలో నటించట్లేదని తేల్చిన రాకుల్

అల్లరి నరేష్ సినిమాలో నటించట్లేదని తేల్చిన రాకుల్

Published on Feb 24, 2014 11:51 PM IST

Rakul-Preet
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో మెరిసిన తార రాకుల్ ప్రీత్ సింగ్ ఆమె అల్లరి నరేశ్ తో సినిమా చేయడంలేదని తెలిపింది. అల్లరి నరేష్, వీరభద్రం కాంబినేషన్ లో రానున్న ఈ సినిమాలో ఈమెను సంప్రదించారని పుకార్లు వినిపించాయి

చివరికి ఈ భామ ట్విటర్ లో ఈ విధంగా సెలవిచ్చింది. “నేను నా తదుపరి సినిమా మనోజ్ తో జంటగా నాగేశ్వర్ రెడ్డి గారి దర్శకత్వంలో చేస్తున్నా. ఇది కాక మరే సినిమాను అంగీకరించలేదు.. ఈ మధ్యే కొన్ని రూమర్లను చదివాను. అందుకే క్లారిఫై చేస్తున్నా”. మనోజ్ తో ఈమె సినిమా మార్చ్ లో మొదలుకానుంది

ఈ భామ త్వరలో ఆది నటించిన రఫ్ సినిమాలో మనముందుకు రానుంది. ఈ సినిమాలో స్వర్గీయ శ్రీహరి ఒక ముఖ్యపాత్రపోషించాడు

తాజా వార్తలు