హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో అల్లరోడి మరో సినిమా

హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో అల్లరోడి మరో సినిమా

Published on Feb 24, 2014 8:30 AM IST

allari-naresh-and-veerabhadram
కామెడీ కింగ్ అల్లరి నరేష్ మరో కామెడీ ఎంటర్టైనర్ లో నటించడానికి రంగం సిద్దం చేసుకుంటున్నాడు. ఈ సినిమాకి వీరభద్రం చౌదరి డైరెక్టర్. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. గతంలో అల్లరి నరేష్ – వీరభద్రం చౌదరి కాంబినేషన్లో వచ్చిన ‘ఆహా నా పెళ్ళంట’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వీరభద్రం ‘పూల రంగడు’, ‘భాయ్’ సినిమాలను తీసాడు.

మామూలుగా మంచి కామెడీ సీక్వెన్స్ లు రాయడంలో వీరభద్రంకి మంచి పేరుంది. ఈ సారి శ్రీధర్ సీపానతో కలిసి కథని సిద్దం చేసుకుంటున్నాడు. జె. భగవాన్ – జె. పుల్లారావు సంయుక్తంగా నిమించనున్న ఈ సినిమాలో రాకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. మిగిలిన వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియజేసే అవకాశం ఉంది.

తాజా వార్తలు