యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా, దర్శకుడిగా చేసిన ‘విశ్వరూపం’ సినిమా పలు వివాదాల నడుమ విడుదలైనా ఆడియన్స్ నుండి మాత్రం సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. అప్పటి నుంచి దీని సీక్వెల్ ‘విశ్వరూపం 2’ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. పలు రోజులుగా సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని వార్తలు వస్తున్న ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇండియాలోని పలు ప్రదేశాల్లో గ్రాండ్ గా షూట్ చేసిన ఈ సినిమాలో గ్లోబల్ టెర్రరిజం గురించి చూపించారు. పూజ కుమార్, ఆండ్రియా జేరేమియా, వహీదా రెహ్మాన్, రాహుల్ బోస్ లు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీకి ఘిబ్రహ్ సంగీతం అందించగా శాందత్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసాడు.