యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న ‘రభస’ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమాలోని నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రేపటి నుంచి ఎన్.టి.ఆర్, సమంతలు కూడా షూటింగ్ లో పాల్గొననున్నారు. వీరిపై రేపటి నుంచి ఓ పాటని షూట్ చేయనున్నారు.
ఈ విషయంపై సమంత స్పందిస్తూ ‘ప్రస్తుతం వివి వినాయక్ – సాయి మూవీ షూటింగ్ లో ఉన్నాను. రేపటి నుంచి ఎన్.టి.ఆర్ తో కలిసి ఓ పాట కోసం డాన్స్ చెయ్యాలి. అది అంత సులభం కాదని’ ట్వీట్ చేసింది. ప్రణిత సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కందిరీగ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మేలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.