మనం సినిమా షూటింగ్ ముగించుకున్న సమంత

మనం సినిమా షూటింగ్ ముగించుకున్న సమంత

Published on Feb 22, 2014 11:04 PM IST

Samantha

స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు, నాగచైతన్య మల్టీ స్టారర్ మనం షూటింగ్ చివరిదశకు చేరుకుంది. విక్రం కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో శ్రియ సరన్, సమంత ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమాలో తన పార్ట్ షూటింగ్ ముగించుకున్న సమంత ఈరోజు తన భావాల్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. మనంతో ఆఖరి రోజు. లెక్కలేనన్ని నవ్వులు. వాటిని మిస్ అవ్వబోతున్నాను అని తెలిపింది. ఈ సినిమా ఒక ఫీల్ గుడ్ సినిమాగా మనముందుకు రానుంది

అనుప్ రుబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రం ఏ. యెన్ . ఆర్ నటించిన ఆఖరి చిత్రం . ఈ సినిమా మార్చ్ ఆఖరివారంలో మనముందుకు రానుంది

తాజా వార్తలు