ఈ ఏడాది పాటలు పాడడం అనే వ్యాపకాన్ని శృతిహాసన్ సీరియస్ గా తీస్కోనుంది. రేస్ గుర్రం సినిమా కోసం ఇటీవలే ఒక పాటను పాడిందన్న విషయం మనకు తెలిసినదే. ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకుడు
ఇప్పుడు శృతి, అనిరుధ్ తో కలిసి మరో పాటను పాడింది. వీరి ఇదివరకే ‘3’ సినిమాకోసం పనిచేసారు. నిజానికి ఈ సినిమాలో బాగా పాపులర్ అయిన ‘వై థిస్ కొలవెరి డి’ పాటలో హం చేస్తూ కనిపిస్తుంది. ఇప్పుడు మాన్ కరాటే అనే సినిమాలో అనిరుధ్ తో కలిసి పాడడం ఆనందంగా వున్నట్టు ట్విట్టర్ లో తెలిపింది. ఈ సినిమాలో శివ కార్తికేయన్, హన్సిక ప్రధాన పాత్రధారులు. వేసవిలో ఈ చిత్రం మనముందుకు రానుంది
రేస్ గుర్రం సినిమాలో కాకుండా ఈ భామ వెల్కం బ్యాక్, గబ్బర్ సినిమాలో నటిస్తుంది. అంతేకాక విశాల్ తో ఒక తమిళ సినిమా ఏప్రిల్ లో మొదలుకానుంది