స్వామి రారా సినిమాలో నటించి ఆ సినిమాను విజయవంతంగా మార్చిన స్వాతి ఆ తరువాత కొన్ని మళయాళ సినిమాలలో నటించింది. ఇప్పుడు చాన్నాళ్ళుగా విడుదలకోసం ఎదురు చూస్తున్న బంగారు కోడిపెట్ట సినిమా ఫిబ్రవరి 27న మనముందుకు రానుంది.
“ముందుగా నాకు అవకాశాలు రావట్లేదని పెద్దలతో క్లోజ్ గా ఉండమని సలహాలు ఇచ్చారు. అయితే నేను వాటిని పట్టించుకోలేదు. తెలుగు సినిమాలో తెలుగు హీరోయిన్స్థానం లేదన్న అపవాదు నేను నమ్మను. నేను నా కెరీర్ సాగుతున్న విధానానికి చాలా ఆనందంగా వున్నాను. ఇక్కడ అవకాశాలు లేనప్పుడు నేను తమిళ, మళయాళ సినిమాలలో నటించాను” అని తెలిపింది నవదీప్, స్వాతి జంటగా బంగారు కోడిపెట్ట రూపుదిద్దుకుంది. రాజ్ పిప్పాల దర్శకుడు. మహేష్ శంకర్ సంగీతాన్ని అందించాడు.