చాలా అంటే చాలా కాలం నుంచి వాయిదా పడుతూ వస్తున్న ‘ఆటోనగర్ సూర్య’ ఎట్టకేలకు విడుదల దశకు చేరుకుంది. దాదాపు సంవత్సర కాలంపాటు బాలన్స్ ఉన్న కొంత పార్ట్ షూటింగ్ ని ఇటీవలే పూర్తి చేసారు. అలాగే ప్రొడక్షన్ ఈ సినిమాని ఫిబ్రవరి 27న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు.
ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోన్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ సారి కూడా అనుకున్న టైంకి రాదని అంటున్నారు. మాకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి 50% సినిమా అనుకున్న తేదీకే వచ్చే అవకాశం ఉందని’ ఓ డిస్ట్రిబ్యూటర్ తెలిపాడు.
నాగ చైతన్య – సమంత జంటగా నటించిన ఈ సినిమాకి దేవకట్టా దర్శకత్వం వహించాడు.ఆర్ఆర్ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా విడుదల గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.