రేపే వర్మ – మోహన్ బాబుల ‘రౌడీ’ ఫస్ట్ లుక్

రేపే వర్మ – మోహన్ బాబుల ‘రౌడీ’ ఫస్ట్ లుక్

Published on Feb 20, 2014 7:30 AM IST

ravi-teja-and-hansika
కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు – మంచు విష్ణు ప్రధాన పాత్రల్లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రౌడీ’. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రేపు విడుదల చేయనున్నారు. మోహన్ బాబుకి జోడీగా జయసుధ నటించనున్న ఈ సినిమాలో మంచు విష్ణు సరసన శాన్వి కథానాయికగా కనిపించనుంది.

మోహన్ బాబు పోషిస్తున్న పవర్ఫుల్ పాత్రకి ఏ మాత్రం తీసిపోకుండా ఉండేలా మంచు విష్ణు పాత్రని వర్మ తీర్ధిదిద్దాడు. వర్మ ఈ సినిమా షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ఇటీవలే కేవలం రెండు రోజుల్లోనే ఓ రొమాంటిక్ సాంగ్ ని పూర్తి చేసాడు. ఏవి పిక్చర్స్ బ్యానర్ పై పార్థసారధి – గజేంద్ర – విజయ్ కుమార్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు