పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్ 2’కి ఖరారైన ముహూర్తం

పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్ 2’కి ఖరారైన ముహూర్తం

Published on Feb 20, 2014 12:00 PM IST

pawan
చాలా కాలం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘గబ్బర్ సింగ్ 2’ సినిమాకి ముహూర్తం కుదిరింది. ‘గబ్బర్ సింగ్ 2’ సినిమా రేపు అనగా ఫిబ్రవరి 21 ఉదయం 5 గంటలకు ఫిల్మ్ నగర్లోని టెంపుల్ లో లాంచనంగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని పెద్ద హడావిడి లేకుండా చాలా సింపుల్ గా చేస్తున్నారు. గతంలో ‘అత్తారింటికి దారేది’ పూజా కార్యక్రమాలు కూడా ఇలానే జరిగాయి.

ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న గబ్బర్ సింగ్ 2 సినిమాకి సంపత్ నంది డైరెక్టర్. శరత్ మరార్ నిర్మించనున్న ఈ సినిమాలో మిగతా నటీనటులు ఎవరు? టెక్నికల్ డిపార్ట్ మెంట్ ఎవరు అనేది త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేస్తారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమా కాకుండా విక్టరీ వెంకటేష్ తో కలిసి ‘ఓ మై గాడ్’ రీమేక్ లో నటించనున్నాడు.

తాజా వార్తలు