పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే ఇండియా టుడే మాగజైన్ కి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు ఫిల్మ్ నగర్లో పెద్ద టాపిక్ అయ్యింది. ఈ ఇంటర్వ్యూలో పవన్ చాలా ప్రశ్నలకి చాలా బాగా సమాధానాలు ఇచ్చాడు.
పవన్ కళ్యాణ్ తన మూడవ పెళ్లి గురించి అడిగితే, ఆ విషయం గురించి ఎక్కువగా చెప్పడానికి ఇష్టపడకపోగా ‘పర్సనల్ విషయాలను పర్సనల్ గానే ఉంచాలని’ సమాధానం ఇచ్చాడు.
అలాగే తన అన్నయ్య చిరంజీవితో ఉన్న రిలేషన్ గురించి అడిగితే తన ఇద్దరి బ్రదర్స్ తోనూ మంచి రిలేషన్ ఉందని అన్నారు. ‘చిరంజీవి గారు నాకు గురువు, నాగబాబు నాకు స్నేహితుడు లాంటి వారు. నాకు వారితో మంచి రిలేషన్ ఉంది. అలాగే మా అక్కచెల్లెళ్ళతో కూడా నాకు మంచి రిలేషన్ ఉందని’ అన్నాడు.
అలాగే పవన్ కళ్యాణ్ తనకు తెలుగు లిటరేచర్ మీద, పాతకాలం పాటల మీద ఎంత మక్కువ ఉందనేది కూడా తెలిపారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్ 2’, ‘ఓ మై గాడ్’ రీమేక్ లో నటించనున్నాడు.