బాలకృష్ణ ‘లెజెండ్’ కోసం ఎడారిలో చేజింగ్ సీక్వెన్స్

బాలకృష్ణ ‘లెజెండ్’ కోసం ఎడారిలో చేజింగ్ సీక్వెన్స్

Published on Feb 20, 2014 8:00 AM IST

Legend_First_Look(1)
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘లెజెండ్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతోంది. ఈ నెలాఖరు వరకు అక్కడే షూటింగ్ జరగనుంది. ఈ సినిమాలోని రెండు పాటలను, కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లను అక్కడ చిత్రీకరిస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం దుబాయ్ ఎడారిలో ఓ స్పెషల్ కార్ చేజ్ సీక్వెన్స్ ని షూట్ చేసారు. ఈ సీక్వెన్స్ సినిమాలో మేజర్ హైలైట్ అవుతుందని ఆశిస్తున్నారు. ఈ సీక్వెన్స్ కోసం బాగా ఖరీదైన ఎస్యువీస్ ను ఉపయోగించారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను బాలకృష్ణ లుక్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు.

దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమా ఆడియోని మార్చ్ 7న రిలీజ్ చేయనున్నారు. వారాహి చలన చిత్రం – 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు సంయుక్తంగా కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు