ఏప్రిల్ కల్లా పూర్తి కానున్న ‘ఒక లైలా కోసం’

ఏప్రిల్ కల్లా పూర్తి కానున్న ‘ఒక లైలా కోసం’

Published on Feb 19, 2014 12:00 PM IST

Naga-Chaithanya1
అక్కినేని నాగ చైతన్య వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతానికి ‘ఒక లైలా కోసం’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. శరవేగంగా జరుగుతున్నా ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం మార్చి చివరికల్లా పూర్తవుతుంది. ఆ తర్వాత బాలన్స్ ఉన్న పాటలను ఏప్రిల్ లో విదేశాల్లో షూటింగ్ చేయనున్నారు. దాంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.

ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నాగ చైతన్య సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్ కుమార్ కొండ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. నాగ చైతన్య నటించిన ‘ఆటోనగర్ సూర్య’, ‘మనం’ సినిమాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంటే ‘దుర్గ’ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

తాజా వార్తలు