కమల్ ను ప్రశంసించిన సూర్య

కమల్ ను ప్రశంసించిన సూర్య

Published on Feb 18, 2014 10:37 PM IST

Suriya-praises-Kamal-Haasan

భారతీయ సినిమా రంగంలో కమల్ పేరు చెక్కు చెదరకుండా లిఖించబడింది. ఆయన తన తర్వాతి తరం నాయకులకు స్పూర్తి ప్రదాత అయ్యారు. వారిలో సూర్య కూడా ఒకరు. అతను ఇంతలా నటించడానికి కమల్ ఏ కారణం అన్నాడు

వీరిద్దరూ ఇటీవలే ఒక తమిళ సినిమా ఆడియో విడుదల వేడుకకు హాజరయ్యారు. వీరి సాన్నిహిత్యం అక్కడ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ వేడుకలో యాంకర్ సూర్య తన సినిమాలకు 110శాతం శ్రమ పెడతారు అన్నప్పుడు సూర్య అడ్డుకుని “ఆ మాట నాకంటే కమల్ గారికే ఎక్కువగా సరిపోతుందని, ఆయన సినిమాలు చూసే ఈ స్థాయికి వచ్చారని” తెలిపాడు

వీరిద్దరూ కలిసి గతంలో ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఏదో ఒక దర్శకుడు మంచి స్టొరీని చెప్పి వీరిని ఒప్పించి ఒక సినిమా తెరకెక్కిస్తే చాలా బాగుంటుంది. కానీ అది ఎంతవరకూ జరుగుతుందో

తాజా వార్తలు