85 కోట్లు నష్టపోయిన పూరి జగన్నాధ్

85 కోట్లు నష్టపోయిన పూరి జగన్నాధ్

Published on Feb 18, 2014 5:30 PM IST

Puri-Jagan
టాలీవుడ్ లో ఉన్న అతి తక్కువ మంది డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్స్ లో పూరి జగన్నాధ్ ఒకరు. తన డేరింగ్ తన సినిమాల్లోని హీరో పాత్రలో కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఫైనాన్షియల్ గా ఈ మధ్య కాస్త కోలుకున్న పూరి జగన్నాధ్ కొద్ది సంవత్సరాల క్రితం తన దగ్గర ఉన్న డబ్బు అంతా పోగొట్టుకొని పలు ఇబ్బందులను ఎదుర్కొన్నాడు.

ఇటీవలే ఓ టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు ఎలా మోసపోయారు? ఎంత నష్టపోయారు? అని అడిగితే పూరి జగన్నాధ్ సమాధానమిస్తూ ‘ నా మైనస్ పాయింట్స్ లో మొదటిది నేను డబ్బుకి పెద్ద ప్రాధాన్యత ఇవ్వను. చెప్పాలంటే కాస్త లెక్కలేని తనం. దాంతో నాతో సన్నిహితంగా ఉండే నా సన్నిహితులే నన్ను మోసం చేసారు. 85 కోట్లు మోసం చేసేసారు. దాంతో నేను దాదాపు రోడ్డు మీదకి వచ్చేసాను. ఇప్పుదిప్పిదె డబ్బు విలువ తెలుస్కోని కాస్త దాచుకోవడానికి ట్రై చేస్తున్నానని’ అన్నాడు.

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఇటీవలే వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ సినిమా యూత్ ని బాగా ఆకట్టుకుంది. నితిన్, ఆద శర్మ జంటగా నటించారు.

తాజా వార్తలు