రెండు సినిమాలకు సైన్ చేసిన పవన్ కళ్యాణ్

రెండు సినిమాలకు సైన్ చేసిన పవన్ కళ్యాణ్

Published on Feb 18, 2014 8:00 AM IST

pawan_kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరం మరింత బిజీగా గడపనున్నాడు. ప్రస్తుతం తన తదుపరి సినిమాలపై వస్తున్న పుకార్లకి తెరదించుతూ ఆయన రెండు సినిమాలు సైన్ చేసారు. అందులో ఒకటి ‘ఓ మై గాడ్’ రీమేక్ అయితే రెండవది ‘గబ్బర్ సింగ్ 2’.

ఈ రెండు సినిమాల షూటింగ్ ఒకేసారి అతి త్వరలో మొదలు కానున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా రెండు సినిమాలకు ఒకే సారి పనిచేయనున్నాడు. ఈ రెండు సినిమాలు కాకుండా పవన్ కళ్యాణ్ చాలా కథలు వింటున్నాడు కానీ ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదు.

ఓ మల్టీ స్టారర్ సినిమాలో పవన్ కలయన్ నటిస్తుండడం పవన్ అభిమానుల్లో, సినీ అభిమానుల్లో మంచి ఉత్సాహాన్ని నింపింది. ఈ ‘ఓ మై గాడ్’ రీమేక్ విజయం అందుకుంటే మిగిలిన పెద్ద హీరోలు కూడా మల్టీ స్టారర్ వైపు అడుగేసే అవకాశం ఉంది. అది తెలుగు సినిమాకి పెద్ద బూస్టప్ ఇస్తుంది.

తాజా వార్తలు