ప్రస్తుతం సమంత ఇండస్ట్రీలో వున్న బిజీతారలలో ఒకరు. ఇప్పుడు తెలుగు, తమిళ భాషలలో చేతినిండా సినిమాలతో ఖాళీ లేకుండా వుంది. ఇంత తీరిక లేని షెడ్యూల్లలో కూడా ఆమె సమాజానికి సాయపడాలనుకోవడం మెచ్చుకోదగ్గ విషయం
గతకొన్ని నెలలుగా సమంత తన డ్రీం ప్రాజెక్ట్ పై కుస్తీ పడుతుంది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కు తీసుకురానుంది. ‘ప్రత్యూష’ అనే వెల్ ఫేర్ ఆర్గనైజేషణ్ ను సమంత ఈ ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుపుతారు. సమంత ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు ఏడాదిగా కష్టపడుతుంది
ఎన్.టీ.ఆర్ హీరోగా నటిస్తున్న ‘రభస’ సినిమాలో సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ లో జరగుతుంది. సంతోష్ శ్రీనివాస్ దీనికి దర్శకుడు