త్వరలో మొదలుకానున్న శర్వానంద్, నిత్యామీనన్ ల సినిమా

త్వరలో మొదలుకానున్న శర్వానంద్, నిత్యామీనన్ ల సినిమా

Published on Feb 16, 2014 3:15 AM IST

Sharwanand,-Nithya-Menen
శర్వానంద్ నిత్యామీనన్ త్వరలో ఒక తెలుగు సినిమాకోసం జతకట్టనున్నారు. వీరికాంబినేషన్ లో తీసిన గత చిత్రం ‘ఏమిటో ఈ మాయ’ ఇంకా విడుదల కావాల్సివుంది. ఇప్పుడు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మరో సినిమాను అంగీకరించారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎస్ రామా రావు నిర్మిస్తున్నారు

ఈ నెల చివర్లో సినిమా మొదలుకానుంది. గతంలో ఈ దర్శకుడు తీసిన ‘ఓనమాలు’ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు తెలుపనప్పటికి స్క్రిప్ట్ చాలా బాగా వచ్చిందని సమాచారం. హీరో హీరోయిన్ లు ఇద్దరూ తమ పాత్రలు విని ఆశ్చర్యపోయారట

ప్రస్తుతం శర్వానంద్ సుజీత్ దర్శకత్వంలో ‘రన్ రాజా రన్ ‘ సినిమాలో బుస్య్గా వున్నాడు. యు.వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు

తాజా వార్తలు