ఈరోజు కర్ణాటక బుల్ డోజర్లతో జరగనున్న మ్యాచులో తమ జట్టు విజయం ఖాయమని తెలు వారియర్స్ ఉప సారధి అక్కినేని అఖిల్ జోస్యం చెప్పాడు. మనజట్టు సెమీ ఫైనల్ కు వెళ్ళాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ ఇది
అఖిల్ మీడియాతో మాట్లాడుతూ “సీ.సీ.ఎల్ 4 మేము బాగా ఆడుతున్నాం. ఈరోజు మ్యాచ్ గెలుస్తామన్న నమ్మకం వుంది. గతంలో కర్ణాటక జట్టును చాలా సార్లు ఓడించాం. ముఖ్యంగా హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచులలో” అని అన్నాడు. అంతేకాక ప్రతీ మ్యాచ్ ను నాగార్జున, అమల తిలకిస్తున్నారు అని, మ్యాచ్ పూర్తవగానే మెసేజ్ పెడుతున్నారని తెలిపాడు. తమ నాయకుడు వెంకటేష్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు
ఈ సెలబ్రిటీ లీజ్ 4వ సీజన్ బాగా పాపులర్ అయినందున ఈరోజు రాత్రి లాల్ బహుదూర్ స్టేడియం లో జరిగే మ్యాచ్ కు భారీ సంఖ్యలో ప్రేక్షకులు వస్తారని నిర్వాహకుల అంచనా