శరవేగంగా సాగుతున్న చైతూ ఒక లైలా కోసం

శరవేగంగా సాగుతున్న చైతూ ఒక లైలా కోసం

Published on Feb 14, 2014 9:35 PM IST

naga-chaitanya
నాగ చైతన్య నటిస్తున్న ‘ఒక లైలా కోసం’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈ సినిమా టాకీ భాగాన్ని దాదాపు పూర్తిచేసుకుంది. ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్ ను జరుపుకుంటున్న ఈ చిత్రం దీని తరువాత, ప్యాచ్ వర్క్ ను, పాటలను తెరకెక్కించనున్నారు

ఈ సినిమాకు విజయ్ కుమార్ కొండా దర్శకుడు. నాగ చైతన్య సరసన పూజా హెగ్దే నటిస్తుంది. ఈ ప్రేమకధను నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. గతఏడాది గుండెజారి గల్లంతయ్యిందే తో హిట్ కొట్టిన దర్శకుడు ఈ సినిమా రూపుదిద్దుకుంటున్న విధానంపై ఆనందంగా వుంటున్నాడు

దీని తరువాత శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో చైతు, హన్సికల కాంబినేషన్ లో దుర్గా సినిమా ప్రారంభంకానుంది

తాజా వార్తలు