ఆహాకళ్యాణంపై ఆశలు పెట్టుకున్న వాణి కపూర్

ఆహాకళ్యాణంపై ఆశలు పెట్టుకున్న వాణి కపూర్

Published on Feb 14, 2014 9:10 PM IST

Vani-Kapoor-Latest-Stills-(
బాలీవుడ్ హీరొయిన్ వాణికపూర్ తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టడానికి సర్వం సిద్ధమయింది. నాని సరసన ఈమె నటించిన ఆహాకళ్యాణం ఈనెల 21న విడుదలకానుంది. గోకుల్ కృష్ణ దర్శకుడు

ఈ భామ మీడియాతో మాట్లాడుతూ “ఢిల్లీ, ముంబైలలో పుట్టినా అవేవి ఈ సినిమాను నన్ను మిగిలిన వాటిలకంటే చాలా సులభంగా దగ్గరచేశాయి. నా తెలుగు, తమిళ స్నేహితులకు ధన్యవాదాలు. ఈ సినిమాలో నేను కష్టపడ్డవి కేవలం డైలాగుల కోసమే. అవికూడా ఎంతో ఓర్పుగా నేర్పిన నాని, గోకుల్ కు ధన్యవాదాలు. ఈ సినిమా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా” అని తెలిపింది

ఈ సినిమా యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించారు. ధరణ్ కుమార్ సంగీతదర్శకుడు

తాజా వార్తలు