సందడి లేని శుక్రవారం

సందడి లేని శుక్రవారం

Published on Feb 14, 2014 1:00 AM IST

Box-Office
ఈ వీకెండ్ తెలుగు సినిమా ప్రేమికులకి చాలా డల్ గా ఉండనుంది. ఇప్పటికైతే ఈ వారంలో మూడు చిత్రాలు రిలీజ్ అవ్వనున్నాయి. అవి ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్ నటించిన ‘ట్రాఫిక్’ ‘హమ్ తుమ్’ మరియు ‘లవ్ డాట్ కాం’. ఈ చిత్రాలు వేటిని పెద్దగా ప్రమోట్ చేయలేదు. ఈ చిత్రాలు బాక్స్ ఆఫీసు దగ్గర ఏ మాత్రం సందడి క్రియేట్ చేస్తాయో చూడవలసి వుంది.

నితిన్ ‘హార్ట్ ఎటాక్’, మనోజ్ ‘పాండవులు పాండవులు తుమ్మెద’ మరియు నాని నటించిన ‘పైసా ‘ ఇప్పటికే రాష్త్రంలోని చాలా ధియేటర్ లలో ప్రదర్శింపబడుతున్నాయి. సునీల్ ‘భీమవరం బుల్లోడు’ ఫిబ్రవరి 14నవిడుదల కావాల్సి వుండగా ఈ చిత్ర విడుదల ఈ నెల ఆఖరి వారానికి వాయిదా పడింది.

తెలుగు లో విడుదల కాబోతున్న పెద్ద చిత్రం ‘ఆహా కళ్యాణం’ ఫిబ్రవరి 21 న విడుదల కానుంది.

తాజా వార్తలు