లేజండ్రీ డైరెక్టర్ బాలు మహేంద్ర ఇకలేరు.!

లేజండ్రీ డైరెక్టర్ బాలు మహేంద్ర ఇకలేరు.!

Published on Feb 13, 2014 12:36 PM IST

Balu-Mahendra-Margazhi-16-A

సౌత్ ఇండియాలో ముఖ్యంగా తమిళ్ ఇండస్ట్రీలో ఫేమస్ మరియు లేజండ్రీ దర్శకుడైన బాలు మహేంద్ర ఈ రోజు మరణించారు. 74 సంవత్సరాల వయసు కలిగిన బాలు మహేంద్ర గత కొద్ది రోజులుగా అస్వస్థతో బాదాపడుతున్న ఆయన ఈ రోజు చెన్నై లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో కన్ను మూశారు.

1939 మే 20న జన్మించిన బాలు మహేంద్ర సౌత్ ఇండియన్ సినిమా రంగంలో ఒక్క డైరెక్టర్ గానే కాకుండా సినిమాటోగ్రాఫర్ గా, రైటర్ గా, ఎడిటర్ గా మరియు నిర్మాతగా ఎన్నో సినిమాలకు పనిచేసాడు. ఆయన రెండు నంది అవార్డ్స్, ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ని గెలుచుకున్నారు. ఆయన ఒక్క తమిళంలోనే కాకుండా కమల్ హాసన్ తో హిందీలో సద్మ, అలాహే తెలుగులో నిరీక్షణ సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఇలాంటి లేజండ్రీ దర్శకుడు ఇండస్ట్రీకి దూరమవ్వడం ఒక తీరని లోటని చెప్పాలి.

బాలు మహేంద్ర గారి మరణానికి చింతిస్తూ 123తెలుగు.కామ్ తరపున తన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాం.

తాజా వార్తలు