కమల్ హాసన్ ప్రసుతం ‘విశ్వరూపం’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ మరియు రిలీజ్ ఏర్పాట్లలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్ కాగానే ఆయన నటించాల్సిన ‘ఉత్తమ విలన్’ సెట్స్ పైకి వెళుతుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇదంతా బాగానే ఉన్నా ఈ సినిమా కథానుసారం ఇందులో ముగ్గురు హీరోయిన్స్ ఉండాలి. కానీ ఇంకా ఒక్కరు కూడా ఇంకా ఫైనలైజ్ కాలేదు.
ఈ చిత్ర డైరెక్టర్ రమేష్ అరవింద్ ప్రస్తుతం సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్స్ అయిన కాజల్ అగర్వాల్, త్రిష, తమన్నాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. డేట్స్ కుదిరి ఈ ముగ్గురిలో ఎంతమంది సైన్ చేస్తారు అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్ర టీం మాత్రం ఈ నెలాఖరు కల్లా హీరోయిన్స్ ని ఫైనలైజ్ చేసి వచ్చే నెల నుంచి సెట్స్ పైకి వెళ్ళడానికి ప్లాన్ చేస్తోంది. ఈ మూవీలో కమల్ హాసన్ తో పాటు కె. బాలచందర్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.