ఏప్రిల్ లో ప్రారంభం కానున్న ‘కేరింత’

ఏప్రిల్ లో ప్రారంభం కానున్న ‘కేరింత’

Published on Feb 13, 2014 3:45 AM IST

Sai-Kiran-Adivi
గతంలో ‘వినాయకుడు’, ‘విలేజ్ లో వినాయకుడు’ చిత్రాలకి దర్శకత్వం వహించిన సాయి కిరణ్ అడివి ‘కేరింత’ అనే ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ ని చిత్రీకరించనున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నాడు.

ఈ చిత్రం లో ముఖ్య పాత్రల కోసం ఆంధ్ర ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో చిత్ర బృందం పర్యటిస్తుంది. మాకు లభించిన స్పందన అద్బుతం గా వుంది అమెరికా మరియు పలు దేశాల నుంచి కూడా దరకాస్తులు వస్తున్నాయని దిల్ రాజు తెలిపారు. నేను ఎప్పుడూ టీం వర్క్ నే నమ్మాను అందుకే మా బ్యానర్ లో చాలా విజయవంతమైన చిత్రాలు నిర్మించాము. ఐదు ఏళ్ల విరామం తర్వాత కొత్త వారితో పని చేస్తున్నాను ‘కేరింత’ తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకం వుంది, సాయి కిరణ్ అడివి చాలా మంచి స్క్రిప్ట్ రాశారు అని దిల్ రాజు జోడించారు.

ఈ చిత్రం లో ముగ్గురు హీరో లో ఐదుగురు హీరోయిన్ లో వుంటారు. నటీనటుల్ని మార్చ్ లో ఖరారు చేశాక ఈ చిత్రం ఏప్రిల్ లో ప్రారంభంకానుంది. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించనున్నారు.

తాజా వార్తలు