అల్లు అర్జున్ ‘రేసు గుర్రం’ చిత్రీకరణ పూర్తి కావొచ్చింది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని లక్ష్మి నరసింహ బ్యానర్ పై నల్లమలపు శ్రీనివాస్ మరియు డా. వెంకటేశ్వర రావులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. చివరి పాట చిత్రీకరణ ఫిబ్రవరి 17న హైదరాబాద్ లో ప్రారంభంకానుంది. గత నెలలో అల్లు అర్జున్ మరియు కైరా దత్ ల పై ఒక ఐటెం సాంగ్ ని చిత్రీకరించారు. మంచి వినోదాత్మకమైన ఈ చిత్రం లో బ్రహ్మనందం ఒక ముఖ్య పాత్ర ను పోషిస్తున్నారు. సలోని సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం లో రవి కిషన్ అనే భోజ్ పురి నటుడు విలన్ పాత్ర పోషిస్తున్నారు.
ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మనోజ్ పరహంస ఛాయాగ్రహణం అందిస్తున్నారు. వక్కంతం వంశీ కథ అందించిన ఈ చిత్రం లో వేసవి విడుదల కావాల్సివుంది .