టాలీవుడ్ తారలు కొత్త సంవత్సరాన్ని పలుకోణాల్లో ఆహ్వానించనున్నారు. చాలా మంది కుటుంబంతో సహా వెకేషన్ కు వెళ్తే మరికొంతమంది హైదరాబాద్ లోనే జరుపుకోవడానికి పూనుకున్నారు
లక్ష్మి మంచు, మనోజ్, హన్సిక, నిఖిల్, నాని మొదలగు తారలు ఈ వేడుకను అమెరికాలో జరుపుకొనున్నారు. ప్రియమణికి థాయ్ ల్యాండ్ నచ్చితే, అమలా పాల్ కు యురోప్ లో ఫ్యామిలీతో జరుపుకుంటేనే కిక్కెక్కుతుందట. తమన్నా కుటుంబ సభ్యులకోసం ముంబై వెళ్తే. శృతిహాసన్ తన సొంత స్థలం చెన్నై చేరుకుంది
ఇక మన హీరోలు మహేష్ బాబు, ఎన్.టి.ఆర్ మరియు ప్రభాస్ హైదరాబాద్ లోనే కుటుంబ సభ్యుల నడుమ నూతన సంవత్సరాన్ని ఆహ్వానించనున్నారు. చాలా మంది తారాలకు ఇధి శుభసంవత్సరం. 2014 కూడా ఇలాగే తెలుగు సినిమాకు విజయాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు