బాలీవుడ్ బ్యాచిలర్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న త్రిష

బాలీవుడ్ బ్యాచిలర్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న త్రిష

Published on Dec 30, 2013 4:24 PM IST

trisha
గత దశాబ్ద కాలంగా సౌత్ ఇండియాలో అగ్రతారగా వెలుగొందుతున్న త్రిష గత కొద్ది రోజులుగా అవకాశాలు అందిపుచ్చుకోవడంలో కాస్త వెనుకపడింది. త్రిష ఈ సంవత్సరం తమిళంలో చేసిన ఒకే ఒక్క సినిమా ‘ఎంద్రెంద్రుం పున్నాగై’ సినిమా క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. జీవా హీరోగా నటించిన ఈ సినిమా ‘చిరునవ్వుల చిరుజల్లు’ గా తెలుగు విడుదల కానుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ టీవీ షోకి వచ్చిన త్రిషని మీరు – నన్ను పెళ్లి చేసుకోండి అని ఎవరికి ప్రపోజ్ చెయ్యాలనుకుంటున్నారు అని అడిగితే ‘ నాకు ఆ అవకాశం వస్తే బాలీవుడ్ బాద్షా సల్మాన్ ఖాన్ కి ప్రపోజ్ చేస్తాను. నేను చిన్నప్పటి నుంచి ఆయనకి పెద్ద అభిమానినని’ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం త్రిష తెలుగులో ఏ సినిమా చేయడం లేదు. తమిళంలో మాత్రం రెండు సినిమాలు చేస్తోంది.

తాజా వార్తలు