స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘రేసు గుర్రం’ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన ఓ విషయం మాకు తెలిసింది. ఈ చిత్ర వర్గాలు చెబుతున్న దాని ప్రకారం ఈ మూవీ సెకండాఫ్ లో అల్లు అర్జున్ పలువురు కమెడియన్స్ తో కలిసి ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తారని అంటున్నారు.
సురేందర్ రెడ్డి కమర్షియల్ గా కాస్త సేఫ్ గా ఉండే దారిని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సలోని సెకండ్ హీరోయిన్ గా కనిపించనుంది. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాని నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్నాడు. రేసు గుర్రం 2014 సమ్మర్లో రిలీజ్ కానుంది.