టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా మూడు సూపర్ హిట్స్ అందుకున్నప్పటికీ ఏ మాత్రం రిలాక్స్ అవ్వకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం తన ‘1-నేనొక్కడినే’ సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా మహేష్ బాబు కెరీర్లో ల్యాండ్ మార్క్ గా నిలిచింది. ఇటీవలే ఈ మూవీ ఆడియో ఫంక్షన్ లో మహేష్ బాబు ‘నన్ను అభిమానులు ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. అందుకే నేను కొత్త రకమైన సినిమాలు చేయగలుగుతున్నాను. వాళ్ళకి ఎలా థాంక్స్ చెప్పాలో తెలియదు, ఒక్క చేతులెత్తి దండం పెట్టడం తప్ప’ అని అన్నాడు.
తాజాగా మరోసారి మహేష్ బాబు తన సింప్లిసిటీతో ఫాన్స్ ని స్టన్ అయ్యేలా చేసాడు. ఇటీవలే ఓ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సక్సెస్ మంత్ర గురించి చెబుతూ ‘నా గత సినిమా హిట్ అయ్యిందా లేక ఫ్లాప్ అయ్యిందా అని ఎవరు గుర్తు పెట్టుకుంటారు. అందుకే ప్రతి సినిమాకి ఎంతో ఎక్కువ కష్టపడాలని’ అన్నాడు. ఇది చూసిన మహేష్ బాబు ఫాన్స్ అతని సింప్లిసిటీని చూసి తెగ పొగిడేస్తున్నారు.
అంతే కాకుండా ఇటీవలే కాస్త వివాదాన్ని క్రియేట్ చేసిన ‘1-నేనొక్కడినే’ పోస్టర్ విషయంలో కూడా ఆయన క్షమాపణ కోరాడు. ‘ఎవరి ఫీలింగ్స్ ని అన్నా బాధపెట్టుంటే మమ్మల్ని క్షమించండి. మేము తప్పు చేసి ఉండవచ్చు, కానీ సినిమా చూస్తే అంత చెడుగా మేము చూపించలేదని మీకు అర్థమవుతుందని’ మహేష్ బాబు అన్నాడు.
మహేష్ బాబు ప్రస్తుతం ‘1-నేనొక్కడినే’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పాల్గొంటున్నాడు. ‘1-నేనొక్కడినే’ సినిమా సంక్రాంతికి రావడంలేదని కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి కానీ వాటిల్లో నిజం లేదు. ఈ చిత్ర టీం జనవరి 10న సినిమాని భారీగా రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తోంది.
మరోవైపు హైదరాబాద్ లో జరుగుతున్న ‘ఆగడు’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు.