విడుదలైన జెండాపై కపిరాజు ఆడియో

విడుదలైన జెండాపై కపిరాజు ఆడియో

Published on Dec 29, 2013 9:40 AM IST

Jenda-Pai-Kapiraju
యంగ్ హీరో నాని, అమలా పాల్ జంటగా నటించిన ‘జెండాపై కపిరాజు’ సినిమా ఆడియో నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ వేడుకకి వివి వినాయక్, తనికెళ్ళ భరణి, అల్లరి నరేష్, శర్వానంద్, వరుణ్ సందేశ్, నిఖిల్, సుదీర్ బాబు, దామోదర్ ప్రసాద్, వంశీ పైడిపల్లి, గోపీచంద్ మలినేని తదితరులు అతిధులుగా హాజరయ్యారు. అలాగే తమిళ్ హీరో జయం రవి ముఖ్య అతిధిగా హాజరయ్యాడు.

ఈ చిత్ర డైరెక్టర్ సముద్రఖని మాట్లాడుతూ ‘ నాని తో పనిచేయడం చాలా మంచి అనుభవం. చెప్పాలంటే దేవుడి వారసుడేమో ఎందుకంటే కెమెరా ముందుకు రాగానే అతను తనని తానూ మార్చుకునే విధానం అసలు మాటల్లో చెప్పలేనిదని’ అన్నాడు. జయం రవి నాని తనకు చాలా స్ఫూర్తి అని అలాగే జెండాపై కపిరాజు నాని కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని అన్నాడు. నాని మాట్లాడుతూ ‘ ఈ సినిమాకి సంబందించిన క్రెడిట్ మొత్తం సముద్రఖనికే చెందుతుంది. ఈ సినిమాని షూట్ చేయడం చాలా కష్టం. అలాగే నాతో ఓ డిఫరెంట్ పాత్రని చేయించాడు. అందుకే అతను ఎక్కువ టైం అడగటం తో నేను అన్ని సినిమాలు పూర్తి చేసుకొని మాయ కన్నన్ పాత్రలోకి మారగలిగానని’ అన్నాడు.

నాని ద్విపాత్రాభినయంలో కనిపించనున్న ఈ సినిమాలో రాగిణి ద్వివేది ఓ కీలక పాత్రలో కనిపించనుంది. జివి ప్రకాష్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించాడు.

తాజా వార్తలు