రామ్ చరణ్ కొత్త హిందీ సినిమా విశేషాలు

రామ్ చరణ్ కొత్త హిందీ సినిమా విశేషాలు

Published on Dec 28, 2013 4:11 AM IST

ram-charan
రామ్ చరణ్ బాలీవుడ్ డెబ్యూ జంజీర్ ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. అపూర్వ లఖియా తీసిన ఈ సినిమాను ప్రేక్షకులు ఏ మాత్రం ఆదరించలేదు. రామ్ చరణ్ కు ఇది ఒక గుణపాఠంగా మిగిలింది.

ఈ సెప్టెంబర్ లో రామ్ చరణ్, ‘లగాన్’, ‘స్వదేశ్’ వంటి హిందీసినిమాల దర్శకుడు అశుతోష్ గోవారికర్ ను ఒక పెద్ద చారిత్రాత్మక సినిమా కోసం కలిసాడని సమాచారం, ఈ సినిమా అక్టోబర్ లేక నవంబర్ 201కి మొదలుకానుంది. ఈ సినిమా మొదలవడానికి చాలా సమయం వున్నా దీంట్లో దీపికా పదుకునే నాయిక అని అప్పుడే వార్తలు పుట్టుకొచ్చేస్తున్నాయి. వీరిద్దరూ క్రితం సంవత్సరం ఒక పెప్సీ ప్రచారచిత్రానికి పనిచేసిన సంగతి తెలిసినదే.

రామ్ చరణ్ ‘ఎవడు’ జనవరి 12న విడుదలకానుంది. ఆ తరువాత తను కృష్ణ వంశీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటాడు. ఈ సినిమాకు సంబంచిందిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుపుతారు.

తాజా వార్తలు