అక్కినేని నాగ చైతన్య – సమంత జంటగా నటించిన సినిమా ‘ఆటోనగర్ సూర్య’. ఈ సినిమాని జనవరి 31న రిలీజ్ చేయనున్నామని డైరెక్టర్ దేవా కట్టా తెలియజేశారు. ఇప్పుడే ఈ వార్తని ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. ‘ఆటోనగర్ సూర్య అప్డేట్ : నిర్మాత ఆటోనగర్ సూర్యని జనవరి 31న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి తర్వాతి వారంలో ఆడియో రిలీజ్ చేస్తారు’.
ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆటోనగర్ సూర్య చాలా రోజుల క్రితమే రిలీజ్ కావాల్సి ఉంది కానీ ఫైనాన్సియల్ సమస్యల వల్ల ప్రొడక్షన్ యూనిట్ రిలీజ్ చెయ్యలేకపోయింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. ఆటోనగర్ సూర్య మంచి పవర్ఫుల్ డైలాగ్స్ తో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.