సంక్రాంతికి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేయనున్న బాలకృష్ణ

సంక్రాంతికి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేయనున్న బాలకృష్ణ

Published on Dec 24, 2013 1:52 PM IST

balakrishna
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘లెజెండ్’ సినిమా 2014 మార్చిలో విడుదలవుతుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా అండర్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబందించిన టీజర్ ని సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఈ టీజర్ లో బాలకృష్ణ ఇప్పటి వరకు చూడని విదంగా ఉండనుంది. ఆ కొత్త అవతారంలో బాలకృష్ణ ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.

బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రాధిక ఆప్టే, సోనాల్ చౌహన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు నెగిటివ్ పాత్రలో నటిస్తున్నాడు. వారాహి చలన చిత్రం, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ కలిసి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు