టాకీ పార్ట్ పూర్త చేసుకున్న రేసు గుర్రం

టాకీ పార్ట్ పూర్త చేసుకున్న రేసు గుర్రం

Published on Dec 24, 2013 8:05 AM IST

Race_Gurram
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘రేసు గుర్రం’ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. ఇక కేవలం రెండు పాటలను మాత్రమే షూట్ చెయ్యాల్సి ఉంది. ఈ పాటల షెడ్యూల్ జనవరి మొదటి వారంలో మొదలు కానుంది. ఆ రెండు పాటలతో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. మరో వైపు ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ఈ సినిమాని ఫిబ్రవరిలో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేసుకుంటోంది.

శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సలోని సెకండ్ హీరోయిన్ గా కనిపించనుంది. అలాగే భోజ్ పురీ నటుడు రవికిషన్ నెగటివ్ రోల్ లో కనిపించనున్న ఈ మూవీకి సురేందర్ రెడ్డి డైరెక్టర్. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాని నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్నాడు. కామెడీ సమపాళ్ళలో ఉంటూ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ‘రేసు గుర్రం’ ఉంటుందని ఆశిస్తున్నారు.

తాజా వార్తలు