సెలవులంటే ఎవరికీ నాచావు చెప్పండి? మన సినిమా యాక్టర్లు కూడా ఇందుకు మినహాయింపు కాదు. తాను నటిస్తున్న ‘హం షకల్స్’, ‘ఇట్స్ ఎంటర్టైన్మెంట్’ హిందీ సినిమాలు దాదాపు పూర్తిచేసుకుని పుట్టిన రోజు జరుపుకోవడానికి అమెరికా ఫ్లైట్ ఎక్కిన తమన్నా అక్కడ హాలీడేస్ ను బాగా ఎంజాయ్ చేస్తుంది
అక్కడనుండి తిరిగి రాగానే మహేష్ బాబు నటిస్తూ, శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్న యాక్ష డ్రామా ‘ఆగడు’ లో నటిస్తుందని సమాచారం.ఈ దర్శక- నాయక ద్వయంతో మొదటిసారి నటిస్తున్న ఈ మిల్కీ బ్యూటీ మాస్ పాత్ర పోషిస్తుందట. 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. అంతేకాక రాజమౌళి కలల ప్రాజెక్ట్ ‘బాహుబలి’లో ప్రభాస్ సరసన నటిస్తుందని ఇటీవల అందరికి తెలిసింది
తమన్నా తదుపరి సినిమా అజిత్ ప్రధాన పాత్రలో నటించిన ‘వీరం’ జనవరి 10న విడుదలకానుంది