పరుశురామ్ తో మూడోసారి నటించనున్న హీరో

పరుశురామ్ తో మూడోసారి నటించనున్న హీరో

Published on Dec 23, 2013 8:40 PM IST

Nara-Rohit-and-Paashuram
సినిమా రంగంలో కాంబినేషన్ లకు ఎక్కువ ప్రాధాన్యం వుంటుంది. ‘బాణం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నారా రోహిత్, ఆ సినిమాతో విజయ లక్ష్యాన్ని సరిగ్గా గురిపెట్టలేకపోయాడు. తరువాత పరుశురాం దర్శకత్వంలో ‘సోలో’ సినిమాతో హిట్ అందుకున్న ఈ నారా బాబు తరువాత అదే దర్శకుడు తీసి రవితేజ, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ‘సారోచ్చారు’ సినిమాలో తళుక్కున మెరిసి దర్శకుడితో వున్న అనుభందాన్ని చాటుకున్నాడు. ఇప్పుడు మరోసారి ఈ దర్శక-హీరో కాంబినేషన్ లో కొత్త సినిమా రానుంది. ఇంకా పేరు ఖరారు కాని ఈ సినిమా వచ్చే ఏడాది ఉంది మొదలుకానుంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుపుతారు.

ఈ యేడు ఫిబ్రవరిలో విడుదలైన నారా రోహిత్ ‘ఒక్కడినే’ పరాజయం పాలైంది. ప్రస్తుతం ‘శంకర’, ‘ప్రతినిధి’, ‘మద్రాసి’, ‘రౌడీ ఫెలో’ మరియు కార్తికేయ దర్శకత్వంలో ఒక సినిమాతో బిజీగా వున్నాడు. ఇవన్నీ 2014 లో విడుదలకానున్నాయి. ఇవేకాక నారా రోహిత్ సతీష్, పరశురాం ల సినిమాలలో కూడా నటించనున్నాడు.

ఇదిలావుంటే రోహిత్ త్వరలో నిర్మాత అవతారం కూడా ఎత్తనున్నాడు. ప్రేమ ఇష్క్ కాదల్’లో రాయల్ రాజు పాత్ర వేసిన శ్రీ విష్ణును హీరోగా ‘మారియో’ ఒక సినిమా తియ్యాలని, మరో సినిమాలో తానే నటించాలని 2014కు పెద్ద ప్లానే వేస్కున్నాడు నారా బాబు..

తాజా వార్తలు