పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం నాకిష్టం – అనుష్క

పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం నాకిష్టం – అనుష్క

Published on Dec 22, 2013 6:14 PM IST

Anushka
సుమారు 8 సంవత్సరాల కెరీర్లో అనుష్క సౌత్ ఇండియాలోని దాదాపు అందరి టాప్ హీరోలతో సినిమాలు చేసింది. కానీ తనకి ఇష్టమైన ఓకే హీరోతో మాత్రం ఇంకా సినిమా చేయలేదు. తాజాగా కాకినాడలో ఓ ఈవెంట్ కోసం హాజరైన అనుష్క మాట్లాడుతూ ‘నాకు పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయాలనేది చాలా ఇష్టం. ఒకవేళ నాకు గబ్బర్ సింగ్ 2 లో చేసే ఛాన్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వాదులు కోనని’ తెలియజేసింది.

ప్రస్తుతం అనుష్క సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘బాహుబలి’, గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ‘రుద్రమదేవి 3డి’ సినిమాల్లో నటిస్తోంది. రుద్రమదేవి సినిమా షూటింగ్ మార్చి చివరికల్లా పూర్తవుతుంది. బాహుబలి మాత్రం ఇప్పుడప్పుడే కంప్లీట్ అయ్యే చాన్స్ లేదు. ఎందుకంటే బాహుబలి రెండు పార్ట్స్ గా రానుంది. ఇలాంటి బిజీ షెడ్యూల్ లో ఉన్న అనుష్కకి ఏ సమయంలోనైనా పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 2లో నటించే అవకాశం లభించవచ్చు. ఇవి రెండు కాకుండా మిర్చి సినిమా నిర్మాతలు జి. అశోక్ దర్శకత్వంలో తెరకెక్కించే బాగమతి సినిమాలో నటించనుందని సమాచారం.

ప్రస్తుతానికి గబ్బర్ సింగ్ 2 ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే తెలుగు తమిళంలో కనిపించిన ఓ బాలీవుడ్ భామని గబ్బర్ సింగ్ 2 కోసం ఎంపిక చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయం పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సంపత్ నంది డైరెక్టర్.

తాజా వార్తలు