కొత్త అవతారం ఎత్తనున్న నాగ చైతన్య

కొత్త అవతారం ఎత్తనున్న నాగ చైతన్య

Published on Dec 22, 2013 1:21 PM IST

naga-chaitanya

అక్కినేని వారసుడైన అక్కినేని నాగ చైతన్య ఇప్పటి వరకూ నటన పైనే ఎక్కువ ఆసక్తి కనబరిచాడు. త్వరలోనే ఆయన నిర్మాతగా కొత్త అవతారంలో కనిపించవచ్చనే వార్తలకు నాగార్జున సమాధానం ఇచ్చారు. ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఉయ్యాలా జంపాలా విషయంలో నాగ చైతన్య ప్రొడక్షన్ పనులు చూసుకున్నారు. దీన్ని బట్టి చైతన్య కూడా మీలానే నిర్మాతగా మారుతాడా అని అడిగితే ‘ నిర్మాత అవుతాడో లేదో నేను ఇప్పుడే చెప్పలేను కానీ ఫిల్మ్ మేకింగ్ లో అన్ని విభాగాల గురించి తెలుసుకోవాలన్నదే నా అభిప్రాయం. ఉయ్యాలా జంపాలా ప్రొడక్షన్ లో బాగా యాక్టివ్ గా పాలు పంచుకున్నాడు. అలాగే ఇప్పుడు విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో చేస్తున్న సినిమా విషయంలో కూడా ప్రొడక్షన్ పనులు తానే చూసుకొంటున్నాడని’ సమాధానం ఇచ్చాడు.

విరించి వర్మ డైరెక్ట్ చేసిన ఉయ్యాలా జంపాలా సినిమాని నాగార్జున – రామ్ మోహన్ కలిసి నిర్మించారు. రాజ్ తరుణ్ – అవికా గోర్ జంటగా నటించిన ఈ సినిమా లవ్ స్టొరీ పల్లెటూరిలో జరుగుతుంది. ఈ సినిమా గురించి నాగార్జున మాట్లాడుతూ ‘ చాలా రోజుల తర్వాత ఓ స్వచ్చమైన తెలుగు సినిమాని చూడబోతున్నాం. అలాగే నటీనటుల విషయంలో ఎంతో గర్వంగా ఫీలవుతున్నామని’అన్నాడు. డి. సురేష్ బాబు డిస్ట్రిబ్యూట్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

నాగ చైతన్య ప్రస్తుతం మనం సినిమాలో కాకుండా విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ వారు నిర్మించనున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించనుంది.

తాజా వార్తలు