సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రానున్న ‘1-నేనొక్కడినే’ సినిమా జనవరి 10న భారీ ఎటున రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి, మరో వైపు ప్రొడక్షన్ టీం ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున చేస్తోంది. ఇటీవలే ఈ సినిమా ఆడియో విడుదలైంది. అప్పటి నుంచి ఈ సినిమా హీరో – హీరోయిన్ గురించి బాగా మాట్లాడుకుంటున్నారు.
కృతి సనన్ ఈ సినిమాతో తెలుగువారికి పరిచయమవుతుంది. మహేష్ బాబు ఫ్యాన్స్ ని కృతి లుక్స్ బాగా ఆకట్టుకున్నాయి. మొదటి సారి ఆడియో ఫంక్షన్ లో కృతి సనన్ కనిపించింది. అలాగే నిన్న విడుదల చేసిన ‘ఆవ్ తుజో మొఘ్ కోర్త’ వీడియో సాంగ్ టీజర్ తో అందరి దృష్టిని కృతి ఆకర్షించింది. రిలీజ్ కి ముందే మహేష్ బాబి – కృతి సనన్ జంటకి మంచి రెస్పాన్స్ వస్తోంది.
‘1-నేనొక్కడినే’ ట్రైలర్ డిసెంబర్ 25న రిలీజ్ చేయనున్నారు. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో మహేష్ బాబు రాక్ స్టార్ గా కనిపించనున్నాడు. 14 రీల్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.