సెలిబ్రిటీ క్రికెట్ లీగ్ యొక్క నాలుగవ వర్షన్ ముంబైలో ప్రారంభమయ్యింది. ఎనిమిది ప్రాంతాలనుండి వచ్చిన ఇండస్ట్రీ సెలిబ్రిటీలు ముంబైలో గ్రాండ్ హ్యాత్ లో కర్టైన్ రైజర్ కు హాజరయ్యారు. తెలుగు ఇండస్ట్రీనుండి వెంకటేష్, తరుణ్, శ్రీకాంత్, నిఖిల్, ఆదర్శ్ బాలకృష్ణ వంటి ప్రముఖులు హాజరయ్యారు
ఈ వేడుకకు ప్రధాన ఆకర్షణ సచిన్ టెండూల్కర్, సల్మాన్ ఖాన్. గత యేడాది జరిగిన సి.సి.ఎల్ 3 లో ఆఖరిదాకా వచ్చిన మన వెంకటేష్ జట్టు, కర్నాటక జట్టుతో తలపడి ఓడిపోయింది. గతయేడాది టీమ్ లో రామ్ చరణ్ కలిశాడు. మన జట్టుకు ఛార్మీ బ్రాండ్ అంబాసిడర్. జనవరి, ఫిబ్రవరి లలో మ్యాచులు ప్రారంభంకానున్నాయి
దనుష్, విశాల్, రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా, రాగిణి ద్వివేది, ఉషా ఉతుప్ ఈ వేడుకలో పాల్గున్నారు