ఫిబ్రవరి 7న ఆహా కళ్యాణం

ఫిబ్రవరి 7న ఆహా కళ్యాణం

Published on Dec 20, 2013 7:25 PM IST

Aaha-Kalyanam
‘బ్యాండ్ భాజా భారత్’ సినిమా అఫీషియల్ రీమేక్ అయిన ‘ఆహా కళ్యాణం’ సినిమా ఫిబ్రవరి 7న విడుదలకానుంది. తమిళ మాతృకలో తీసిన ఈ సినిమాను తెలుగులోకి అనువదించారు. ఈ సినిమాతో యష్ రాజ్ సంస్థ తెలుగు, తమిళ రంగాలలో అడుగుపెడుతుంది. గోకుల్ కృష్ణ దర్శకుడు

‘ధూమ్ 3’తో యొక్క అధికారిక ట్రైలర్ ఈరోజు విడుదలచేసారు. ఈ కధతో తెలుగులో గత యేడాది ఒక సినిమా వచ్చినా ఈ ‘ఆహా కళ్యాణం’లో నటీనటుల ఎంపిక ప్రధాన మార్పుకానుంది. సుద్ద్ దేశి రొమాన్స్ లో నటించిన వాణీ కపూర్ ఈ సినిమాతో తమిళ, తెలుగు రంగాలలోకి అడుగుపెట్టనుంది. సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాని, వాణి మధ్య కెమిస్ట్రీ చాలా అందంగా కుదిరింది

ఈ సినిమా ముఖ్యభాగం చెన్నై మరియు మైసూరులో చిత్రీకరించారు. ధరన్ కుమార్ సంగీతదర్శకుడు. లొగనాథన్ శ్రీనివాస్ సినిమాటోగ్రాఫర్

తాజా వార్తలు